మహానాడుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2017-05-28 19:01:02  mahanadu,high court, advocate general,CM,

విశాఖ పట్నం, మే 27 : తెలుగుదేశం పార్టీ 3 రోజుల పాటు ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించ తలపెట్టిన మహానాడుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనివర్సిటీలో అనుమతి ఇవ్వొద్దంటూ ధాఖలు చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ ను, నిన్న లంచ్ మోషన్ లో విచారించి కొట్టివేసింది. ఇప్పటికే మహానాడు ఏర్పాట్లు పూర్తయినందున అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ కోరారు. అయితే భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని పోలిసులు తెలిపిన నేపధ్యంలో... యూనివర్సిటీ స్థలం అనుకూలంగా ఉంటుందని జెడ్ కేటగిరీ భద్రత ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ స్థలం అనుకూలంగా ఉంటుందని, తెలుగుదేశం పార్టీ తరుపున న్యాయవాది వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు యూనివర్సిటీలో మహానాడు సభకు అనుమతినిచ్చింది.