మన సంస్కృతి ఉట్టిపడేలా తెలుగు మహాసభలు

SMTV Desk 2017-12-05 10:54:44  Telugu mahasabhalu, cm kcr, pragathi bhavan meeting.

హైదరాబాద్, డిసెంబర్ 05 : ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ వేడుకల ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో భారీ భద్రత చర్యలను ఏర్పాటు చేయనున్నారు. తెలుగు మహాసభల నిర్వహణపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. తెలుగు సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ సంస్కృతి, కళలు, పండగలు ప్రతిబింబించేలా డాక్యుమెంటరీని రూపొందించాలి" అని అధికారులను ఆదేశించారు. ఈ మహాసభలను ఎల్‌బీ స్టేడియ౦లో నిర్వహించనున్నారు. ఇందు నిమిత్తం కేసీఆర్ స్టేడియాన్ని సందర్శించి ప్రాంగణమంతా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.