రహదారుల బాగును విస్మరించారు : టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ

SMTV Desk 2017-12-04 17:25:33  road systems, TDD President L.Ramana, comments on telangana government.

హైదరాబాద్, డిసెంబర్ 04 : జీఈఎస్ సదస్సు నిమిత్తం నగరానికి ఇవాంకా ట్రంప్ విచ్చేసిన నేపథ్యంలో, కేవలం ఆమె ప్రయాణించే రహదారులను మాత్రమే బాగుచేసి మిగిలిన వాటిని అలాగే వదిలేశారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపి౦చారు. సోమాజీగూడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న రమణ మాట్లాడుతూ.. "కొలువులకై కొట్లాట సభకు విచ్చేస్తున్న యువతను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఏ విద్యార్థులైతే తెలంగాణ కోసం పోరాడారో వారే కేసీఆర్ ను పడగొట్టేందుకు తరలి వస్తున్నారు" అంటూ విమర్శించారు. నిరుద్యోగ బెంగతో ప్రాణాలను కోల్పోయిన ఓయూ విద్యార్ధి మురళి కుటుంబానికి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.