అమెరికా శాసన సభ్యులపై కాల్పులు

SMTV Desk 2017-06-15 13:29:10  america, tramp,

అలెగ్జాండ్రియా, జూన్ 15 : అమెరికాలో జరుగుతున్నా కాల్పుల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల అమెరికా శాసనకర్తల మధ్య ప్రతి సంవత్సరం జరగాల్సిన బేస్ బాల్ పోటి కోసం సిద్దమవుతున్న సభ్యులపై బుధవారం రోజున ఉదయం వాషింగ్జన్ శివారులో ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు గాయాల పాలయ్యారు. వీరిలో సీనియర్ కాంగ్రెస్ సభ్యులు, విప్ స్టీవ్ స్కాలైస్, మరో సభ్యుడు రోజర్ విలియమ్స్, ఇద్దరు న్యాయాధికారులు కూడా ఉన్నారు. ఐదుగురిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రత బలగాలు చంపేసారు. ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. తూటాలకు తీవ్రంగా గాయపడిన స్టీవ్ స్కాలైస్ పూర్తిగా కోలుకోవాలని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేసారు. కాల్పుల ఘటన తనను విషాదంలో ముంచెత్తిందన్నారు. కాల్పులకు దిగిన వ్యక్తీ పై పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ట్రంప్ టీవీ సందేశం ద్వార వెల్లడించారు. కాల్పుల సమయంలో దాదాపు 25 మంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు. బేస్ బాల్ అడుతున్న వారు ఎవరనేది ముందుగా అడిగి తెలుసుకున్న తరువాతే కాల్పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు.