యూపీ ఎన్నికల్లో స్వతంత్రుల జయకేతనం...

SMTV Desk 2017-12-04 16:35:30  UP Elections, independent party win, bjp party.

న్యూఢిల్లీ, డిసెంబరు 4 : యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందా..? అంటే అవుననే సమాధాన౦ ఎక్కువగా వినిపిస్తోంది. కాని మొత్తం పదహారు మున్సిపల్‌ కార్పొరేషన్ల ఫలితాలు వెలువడగా అందులో 14 బీజేపీ గెలుచుకుంది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 35 లక్షల పోలింగ్ నమోదు కాగా, 1300 మంది కార్పొరేటర్లలో 596 మంది బీజేపీ నుంచి గెలుపొందారు. మూడు ప్రధాన పార్టీల గణాంకాలు పరిశీలిస్తే.. స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్న సీట్ల పరంగా స్వతంత్రులే అసలు విజేతలని తెలుస్తుంది. కాగా రెండున్నర కోట్ల మంది ఓట్లేసిన 438 నగర పంచాయతీల్లో 42 శాతం(182 చైర్మన్‌ పదవులు) స్వతంత్రులు గెలుచుకున్నారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కలిసి మొత్తం 7229 మంది వార్డు సభ్యులు స్వతంత్రులే. 652 చైర్మన్‌ పదవుల్లో కేవలం 184 బీజేపీ గెలుచుకుంది. బీజేపీకి సగటున 30 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 52 శాతం పోలింగ్‌ నమోదైంది.