వణుకుతున్న ఉత్తరాది.. మైనస్ లలో ఉష్ణోగ్రతలు...

SMTV Desk 2017-12-04 12:22:21  temperature in north way, weather report, newdelhi.

న్యూఢిల్లీ, డిసెంబర్ 04 : దేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు కనిష్టానికి పడిపోతున్నాయి. ఇంట్లో నుండి బయట అడుగు పెట్టాలంటే ముసుగులు ధరించాల్సి౦దే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఒక వైపు కొరుకుడు చలి, మరోవైపు కాలుష్యం దీంతో బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదైంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. పంజాబ్‌లోని ఆదంపూర్‌లో 4.9, అమృత్‌సర్‌లో 6.6 డిగ్రీల సెల్సియస్‌, కశ్మీర్‌ లోయలో సున్నా డిగ్రీల కంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. వీటితో పాటు శ్రీనగర్‌లో మైనస్‌ 2 డిగ్రీలు, కార్గిల్‌ పట్టణంలో మైనస్‌ 7.2 లుగా ఉంది. అటు హిమాచల్‌ప్రదేశ్‌లో మైనస్‌ 12 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదవుతోంది.