శ్రీలంక ఆటగాళ్ళ తీరుపై కోచ్‌ భరత్‌ అరుణ్‌ మండిపాటు

SMTV Desk 2017-12-03 19:40:29  india, srilanka test, bharath arun , india bowling coach

న్యూఢిల్లీ, డిసెంబర్ 03 : భారత్- శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు టెస్ట్ లో లంక ఆటగాళ్ల తీరు పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూఢిల్లీలో కాలుష్య కారణంగా ప్రత్యర్ధి ఆటగాళ్లు మాటిమాటికి ఆటకు అంతరాయం కల్పించడంతో, భారత్ కెప్టెన్ కోహ్లీ అసహనంతో 536 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లెర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత్ కోచ్ భరత్‌ అరుణ్‌ మాట్లాడుతూ " కోహ్లీ రెండు రోజులు మాస్క్ లేకుండానే ఆటను కొనసాగించాడు. కాలుష్యం ఇరు జట్లకు ఒకే విధంగా ఉంటుంది. కానీ మా జట్టు ఆటగాళ్లు మాస్క్ లు లేకుండానే ఆటను కొనసాగించారు. ఆటపై దృష్టి పెట్టడమే క్రీడాకారులి బాధ్యత. వేదికలతో వాళ్లకి సంబంధంలేదు." అంటూ శ్రీలంక జట్టుకి పరోక్షంగా చురకలంటించారు.