బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం..

SMTV Desk 2017-12-03 18:31:44  BJP, Congress Party, dispute issue, Gujarat assembly election

అహ్మదాబాద్, డిసెంబర్ 03 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంచి ఊపుమీదు౦డగా బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలలోకి వెళితే.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ పోటీచేస్తున్న నేపథ్యంలో ఆ ప్రచారానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తొలగిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్ గురు, దీపు రాజ్ గురులు అక్కడకు చేరుకున్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని అది తీవ్ర రూపం దాల్చింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దీపు రాజ్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించి ఇంద్రనీల్ రాజ్ గురును అదుపులోకి తీసుకున్నారు.