సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన నేతలు

SMTV Desk 2017-12-03 16:16:09  AP assembly, cm chandrababu, BC, TDP, GUNTUR

గుంటూరు, డిసెంబర్ 03 : ఈ నెల 2న కాపులను బీసీలో చేరుస్తున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే కాపులను బీసీలో చేర్చడంతో పాటు 5శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు, తెలిపింది. ఈ మేరకు నిర్ణయంపై గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తానికొండ దయాబాబు, తోట మల్లేశ్వరి, రావిపూడి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక్క గుంటూరులోనే కాకుండా ఏపీలోని పలు చోట్లల్లో టీడీపీ కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి బాణాసంచా పేలుస్తూ, స్వీట్లు పంపిణీ చేశారు.