దూసుకొస్తున్న "ఓఖి తుఫాన్"

SMTV Desk 2017-12-03 14:34:57  OKHI TUFAN, MAHARASTRA, GUJARATH, GODAVARI.

చెన్నై, డిసెంబర్ 03 : "ఓఖి తుపాను" ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్ వైపు సాగుతోంది. ఇప్పటికే కన్యాకుమారిలో భారీ వర్షాల కారణంగా అనేక మంది మృత్యువాత పడ్డారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ తుఫాన్ తన దిశను మార్చుకొని మహారాష్ట్ర, గుజరాత్ వైపు పయనిస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న "ఓఖి" వల్ల మహారాష్ట్రతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్ళి 117 మంది గల్లంతయ్యారు. వారి కోసం రక్షక దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.