మెసేజ్ తో పదవి పోయింది

SMTV Desk 2017-06-15 12:09:23  Rahulgandhi, Pappu is the name, Vinay, the president of Uttar Pradesh Meerut district

మీరట్, జూన్ 15 : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్‌గాంధీని దేశంలోని ప్రత్యర్థిపార్టీలు పప్పూ పేరుతో హెద్దెవ చేస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ విలాసవంతమైన జీవితాన్ని ఎన్నడు గడపలేదన్న విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రామకృష్ణ ద్వివేది అన్నారు. ఇదే పదాన్నిఉత్తరప్రదేశ్‌ మీరట్‌ జిల్లా అధ్యక్షుడైన వినయ్‌ ప్రధాన్‌ రాహుల్‌ను ఉద్దేశించి ఇటీవల వాట్సప్‌ గ్రూప్‌లో చేసిన వ్యాఖ్యలు స్థానికంగా వైరల్‌ అవ్వడంతో అతన్నిపదవుల నుంచి తొలగిస్తున్నట్టు రామకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఐదుగురు రైతులు చనిపోయిన సందర్భంలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌గాంధీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్ ప్రధాన్ వాట్సప్‌లో సందేశాలు పంపారు. భారత జాతీయ కాంగ్రెస్ టైటిల్‌తో పెట్టిన ఈ మెసేజ్‌లు వివాదాస్పదమయ్యాయి. "పప్పూ అనుకుంటే అదానీ, అంబానీ, మాల్యాలతో చేతులు కలుపొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆ మార్గంలో వెళ్తే మంత్రి లేదా ప్రధానమంత్రి కావొచ్చు. అయినా దాన్ని ఎంచుకోలేదు. అందుకుబదులుగా మంద్‌సౌర్ మార్గంపట్టి తన జీవిత ఆశయాన్ని తెలియజేశారు". అంటూ వినయ్ వాట్సప్‌లో మెసేజ్ పెట్టారు. ఈ సందేశాలు వైరల్‌గా మారడంతో ఆయనకు చిక్కులొచ్చిపడ్డాయి. దీని కారణంచే అన్ని పదవుల నుంచి తొలగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.