పవన్ సినిమాలో అలరించనున్న అలనాటి తార...

SMTV Desk 2017-12-02 19:41:58  lissy, pawankalyan, trivikram srinivas,

హైదరాబాద్, డిసెంబర్ 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడక్షన్‌లో నితిన్-మేఘా ఆకాష్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అలనాటి అందాల తార లిజి నటించబోతుంది. ఇంతకి లిజి ఎవరు అనుకుంటున్నారా... గతంలో మలయాళం, తమిళ భాషలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సాధించుకుంది ఈ నటి. ఈ విషయాన్నీ స్వయంగా లిజియే తన ఫేస్ బుక్ వేదికగా.. "కెమెరా ముందుకు మళ్లీ వస్తున్నాను. నా సన్నిహితులు మళ్లీ సినిమాల్లోకి రావాలని అడుగుతున్నారు. 25 ఏళ్ల తర్వాత నేను తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సంయుక్తంగా అందిస్తున్న సినిమా.. కృష్ణ చైతన్య డైరెక్టర్.. నితిన్ మేఘా ఆకాష్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో నేను కీలక పాత్రలో నటిస్తున్నాను. చాలా రోజుల తర్వాత న్యూయార్క్‌లో కెమెరాను ఫేస్ చేయడం కాస్త నెర్వస్‌గా అనిపించింది. ఇంతకాలం దీన్ని మిస్ అయ్యాను" అంటూ పోస్ట్ చేశారు.