గుజరాత్‌ అభివృద్ధి నిజమేనా : షీలా దీక్షిత్

SMTV Desk 2017-12-02 19:05:53  Delhi former Chief Minister Sheila Dikshit, comments on narendra modi.

న్యూఢిల్లీ, డిసెంబర్ 02 : గుజరాత్‌ను అభివృద్ధి చేశామ౦టున్న మాటలన్ని నిజమేనా..? అంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మోదీని నిలదీశారు. మీడియాతో మాట్లాడిన షీలా దీక్షిత్.. గతంలో 22 ఏళ్ళ పాటు బీజేపీ పరిపాలనను ప్రజలు చవి చూశారని, నిజమైన అభివృద్ధి జరగలేదని తెలుసుకున్నారని అన్నారు. గుజరాత్‌ను అభివృద్ధి చేయడం నిజమే అయితే మోదీ ప్రచారానికి రోజు విడిచి రోజు ఎందుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేయాలని కోరుకుంటున్నారని మోదీ రోజు విడిచి రోజు తన సొంత రాష్ట్రానికి వెళ్తున్నారని ఆరోపించారు.