రాష్ట్ర యువత విధానంపై సభలో చర్చ

SMTV Desk 2017-12-02 17:42:56  AP assembly, cm chandrababu, Youth policy Discussion

అమరావతి, డిసెంబర్ 02 : నవంబర్ 10న ప్రారంభమైన ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా నేడు పలు చర్చలు జరిగాయి. చివరిగా రాష్ట్రంలోని యువత విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు యువత సంక్షేమం కోసం చేపట్టనున్న వివిధ కార్యక్రమాలపై ప్రసంగించారు. ఒక్క ఉద్యోగ కల్పనే కాకుండా యువత సాధికారిత పెరగాలన్నారు. యువతను ఉపయోగించుకుంటే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని 196 దేశాలకు 130 దేశాల్లో యువత విధానం ఉందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా యువత విధానాన్ని తీసుకోస్తునందున, ప్రపంచంలో ఎవరికీ లేని అవకాశాలు మనకు ఉన్నాయన్న ఆయన, నిరంతరం విద్య నేర్చుకుంటే అభివృద్ధిలోకి వస్తామని తెలిపారు. డిజిటల్‌ అక్షరాస్యతకు చాలా మంచి భవిష్యత్‌ ఉంటుందని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. కాబట్టి పర్యాటకాన్ని మరింత మెరుగుపరుస్తామని చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.