అమెరికా పై రష్యా కౌంటర్

SMTV Desk 2017-12-02 17:17:49  america, rashya, Counter, Restrictions on journalist

మాస్కో, డిసెంబర్ 02 : అమెరికా, రష్యా దేశాలు, ఒక్కరికి మించి, మరొకరు కౌంటర్లు వేసుకుంటున్నాయి. ఇటీవల రష్యా టెలివిజన్‌ గ్రూప్‌ ఆర్‌టీ అమెరికా కాంగ్రెస్‌ను ప్రసారం చేసే హక్కులు కోల్పోయింది. దీంతో అసంతృప్తికి గురై రష్యా, అమెరికాకు కౌంటర్‌ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. రష్యా పార్లమెంట్‌ను కవర్‌ చేయకుండా అమెరికా జర్నలిస్టుపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రష్యా పార్లమెంట్‌లో ప్రతిపాదన తీసుకొచ్చారట. వచ్చే వారం జరగబోయే సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌లోని ఎగువసభ, దిగువ సభ ఆమోదం పొందితే అమెరికా జర్నలిస్టులు రష్యా పార్లమెంట్‌ సమావేశాలను ప్రసారం చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘విదేశీ మీడియాపై ఆంక్షలు విధించడం అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘించినట్లే. అయితే, ఈ పద్ధతి అమెరికాలోనే ప్రారంభమైనదని, సదరు ప్రతినిధి అన్నారు. ఇందుకు ఆ సంస్థ ఒప్పుకోకపోవడంతో అమెరికా కాంగ్రెస్‌ సమావేశాలను ప్రసారం చేసే హక్కులను ఆర్‌టీ కోల్పోయింది. దీంతో రష్యాకు చెందిన ఆర్‌టీ మీడియా గ్రూప్‌ను విదేశీ సంస్థగా రిజిస్టర్‌ చేసుకోవాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.