విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్‌ తొలగింపు పై ట్రంప్ స్పష్టత

SMTV Desk 2017-12-02 15:32:00  Foreign Minister Tillarson, trump, media, twitter

వాషింగ్టన్, డిసెంబర్ 02 ‌: ఇటీవల ఉత్తరకొరియా, ఇరాన్‌, కొన్ని అరబ్‌దేశాలకు సంబంధించి విదేశాంగ విధానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో టిల్లర్‌సన్‌కు విభేదాలు తలెత్తాయి. దీంతో విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ను పదవి నుంచి తొలగిస్తారంటూ, మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి స్పందించిన ట్రంప్ ట్విట్టర్ ద్వారా, అదంతా మీడియా ఫేక్‌ న్యూస్ అంటూ ట్విట్ చేశారు. కొన్ని విషయాల్లో ఆయనతో విభేదిస్తా, కానీ అతడిని మాత్రం తొలగించడం లేదు. ఇద్దరం కలిసి పనిచేస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం టిల్లర్‌సన్‌ యూరోపియన్‌ టూర్‌కి బయలుదేరనున్నారు. డిసెంబరు 4 నుంచి 8 వరకు బ్రసెల్స్‌, వియన్నా, పారిస్‌ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి అధికారులతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ట్రంప్‌ టిల్లర్‌సన్‌ను తొలగిస్తున్నట్లు యూఎస్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన స్థానంలో సీఐఏ అధిపతి మైక్‌ పాంపియోను నియమించేందుకు శ్వేతసౌధం యోచిస్తోందని అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి. కానీ ట్రంప్ టిల్లర్‌సన్‌ను పదవి నుంచి తొలగించడం లేదని స్పష్టం చేశారు.