ఏపీ అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం

SMTV Desk 2017-12-02 13:14:00  AP assembly, CM Chandrababu naidu, BC, BCC welfare minister Achayyanaidu

అమరావతి, డిసెంబర్ 02 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో నేడు ఉదయం సభ ప్రారంభం కాగానే కాపుల రిజర్వేషన్‌ బిల్లును ఆమోదంకై, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ మేరకు సభలో పలువురు నేతలు సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపి కాపులకు బీసీ ఎఫ్‌ కేటగిరీగా 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లును తీసుకువచ్చారు. అనంతరం వాల్మీకీ బోయల దశాబ్దాల డిమాండ్‌కు గాను ఎస్టీ జాబితాలో చేర్చడం అత్యంత అవసరమని సభలో తీర్మానం చేశారు.