పాత తరహాలోనే హెచ్‌-1బీ వీసా జారీలు

SMTV Desk 2017-12-02 12:28:18  H-1B visa issuance, donald trump, thamaas

వాషింగ్టన్, డిసెంబర్ 02 ‌: కోల్‌కతాలో జరిగిన బెంగాల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సమావేశానికి అమెరికా డిప్యూటీ అసిస్టెంట్‌ స్టేట్‌ సెక్రటరీ థామస్‌ వాజ్దా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గతంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా విధానంపై సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు హెచ్‌-1బీ ఉద్యోగ వీసాల జారీల్లో కఠిన నిబంధనలు తీసుకొస్తామని ట్రంప్‌ అప్పట్లో ప్రకటించారు. అయితే, ప్రస్తుతం అలాంటి చర్యలేం చేపట్టట్లేదని తాజాగా హెచ్‌-1బీ వీసా జారీ విధానం మార్పుల కోసం ప్రస్తుతం ఎలాంటి చట్టం తీసుకురావట్లేదని థామస్‌ వాజ్దా అన్నారు. ఈ వీసాల జారీపై సమీక్ష జరపాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. అయితే దాని తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ విధానాన్ని మార్చాలంటే చట్టంలో అనేక మార్పులు తీసుకురావాలి. ప్రస్తుతానికైతే పాత తరహాలోనే వీసాలు జారీ చేస్తున్నమన్నారు.