మెట్రో వల్ల పెరిగిన ఆర్టీసీ ఆదాయం..!

SMTV Desk 2017-12-02 11:30:12  Metro, RTC income source increase, hyderabad metro trains

హైదరాబాద్, డిసెంబర్ 02 : నగరంలో మెట్రో రైలు ప్రారంభమయ్యాక ఇక ఎవరు ఆర్టీసీ బస్సుల్లో తిరగరని అంతా భావించారు. కాని అంచనాలన్ని తారుమారు చేస్తూ ఆర్టీసీ ఆదాయం మరింత పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెట్రో అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ ఆదాయం పెరగడం గమనార్హం. దీనికి కారణం మెట్రో తొలి ప్రయాణ అనుభవం కోసం ప్రయాణికులు ఆరాటపడడం వల్లనే ఆర్టీసీ ఆదాయం పెరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్‌లో ఆర్టీసీ సగటు ఆదాయం రోజుకు రూ.2.88 కోట్లు ఉండగా, మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక అదనంగా మరో రెండు లక్షల ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది.