నోట్లరద్దు ప్రజాహితమే: వెంకయ్యనాయుడు

SMTV Desk 2017-12-01 18:17:55  venkaiah naidu, vice president, demonitisation

న్యూ డిల్లీ, డిసెంబర్ 01: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు కార్యక్రమం ప్రజాహితమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గురువారం న్యూ డిల్లీలోని చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని అధికారిక లెక్కల్లో చూపని నల్లధనానికి సరైన చిరునామా దొరికిందని ఆయన పేర్కొన్నారు. నోట్లరద్దు వలన ప్రజలు తాత్కాలిక ఇబ్బందులు పడ్డా దీర్ఘకాలంలో దాని ప్రయోజనాలు ఉంటాయని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశ వృద్ధిరేటు గత త్రైమాసికంలో కొంత తగ్గి 5.7 గా నమోదు కాగా, అది మళ్లీ పుంజుకొని 6.3 గా వృద్ధి సాధించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.