ప్రజల బతుకులు మార్చాలనే సురాజ్య యాత్ర : జయప్రకాష్

SMTV Desk 2017-12-01 16:43:56  Lokapatta founder Jayaprakash Narayana, comments on polavaram project,

గుంటూరు, డిసెంబర్ 01 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి అని, ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. గుంటూరులో లోక్‌సత్తా సురాజ్య యాత్రను జేపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ పోలవరం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాలను సక్రమంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. బాధ్యతలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమై౦దని, ప్రజల బతుకులు మార్చాలనే సురాజ్య యాత్రను చేపట్టాం" అని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు.