నిఖిల్ కొత్త చిత్రం ప్రీ- లుక్ వచ్చేసింది..!

SMTV Desk 2017-12-01 16:37:53  nkhil, new movie, pre look, kirak party remake

హైదరాబాద్, డిసెంబర్ 01 : హ్యాపీడేస్ చిత్రంలో తన చిలిపి హావభావాలతో తెలుగు తెరకు పరిచయమైనా కధానాయకుడు నిఖిల్, విన్నూత కథాంశాలతో ప్రేక్షుకులకు చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన హీరోగా, శరణ్‌ కొపిశెట్టి దర్శకత్వంలో, సంయుక్తా హెగ్డే హీరోయిన్ గా ఓ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ- లుక్ ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. కోలివుడ్ లో హిట్ సాధించిన ‘కిరిక్‌ పార్టి’ కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో పుస్తకాలు, సెల్ ఫోన్, చేగోవేరా ఫోటోతో పాటు, ‘కృష్ణకు ఓటు వేయండి’ అని రాసి ఉంది. దీని ప్రకారం చిత్రం కాలేజ్‌ డ్రామా నేపథ్యంలో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు.