పోలవరంను రాజకీయం చేయడం మా ఉద్దేశ్యం కాదు : చంద్రబాబు

SMTV Desk 2017-12-01 16:19:44  polavaram project, cm chandrababu naidu, party leaders, central government.

అమరావతి, డిసెంబర్ 01 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఎలాంటి విమర్శలకు తావివ్వకూడదని, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన లేఖపై ప్రధాని మోదీ, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తానని చంద్రబాబు వెల్లడించారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలవరంను రాజకీయం చేయడం తమ ఉద్దేశం కాదని, ఈ విషయాన్ని అలా రాజకీయ కోణంలో చూడవద్దని తమ రాజకీయ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. ఎన్ని సమస్యలు వచ్చిన పోలవరంపై వెనకడుగు వేయబోనని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.