కార్బోహైడ్రేట్లు ఉన్న అల్పాహారం తీసుకుంటే...

SMTV Desk 2017-06-14 16:44:09   Breakfast carbohydrates, Milk, bread, Labbe University in Germany, Tyrosine called amino acid

బెర్లిన్, జూన్ 14 : అల్పాహారంగా అధికంగా కార్బోహైడ్రేట్లు ఉండే పాలు, బ్రెడ్ ఆ రోజంతా మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. జర్మనీలోని ల్యాబెక్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యాయాన్ని నిర్వహించారు. కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో టైరోసిన్ అనే అమీనో ఆమ్లం తక్కువ స్థాయి లో ఉంటుందని వారు తెలిపారు. మనుషులు నిర్ణయాలను ప్రభావితం చేసే డోపోమైన్ లాంటి మెదడుకు సంబంధించిన రసాయనాల ఉత్పతిలో టైరోసిన్ ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలను తీసుకునే ఓ ఆన్ లైన్ గేమ్ ను కొంతమందితో ఆడించి. ఫలితాలను విశ్లేషించినట్లు తెలిపారు. కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకున్నవారిలో 53 శాతం మంది నష్టం కలిగించే నిర్ణయాలను తిరస్కరించగా.. ప్రోటీన్ లు అధికంగా తీసుకున్నవారిలో దాదాపు 75 శాతం నష్టదాయకమైన నిర్ణయాలనే తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ అధ్యయనం పురుషులపై మాత్రమే నిర్వహించామని పరిశోధకులు తెలిపారు.