పక్షం రోజుల్లో రూ. 40 పెరిగిన "చింతపండు"

SMTV Desk 2017-11-30 11:17:51  tamarind rates increase, ap government, 40 rupees increase.

అమరావతి, నవంబర్ 30 : ఏపీలో గడిచిన పక్షం రోజుల్లో చింతపండు ధర కిలోపై 40 రూపాయల వరకు పెరిగి 190 వరకు చేరుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో చింతపండు నిల్వలు తక్కువగా ఉండడం, చాలా మంది ఇళ్లల్లో పచ్చళ్లు పెట్టుకునే సమయం కావడంతో డిమాండ్ బాగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్పత్తి తగ్గిపోయింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం కూడా దిగుబడిపై పడింది. నవంబర్ తొలి వారంలో కిలో రూ.120 నుంచి రూ.130 వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.190 వరకు పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో హిందూపూర్‌, చిత్తూరు ప్రాంతాల్లో ఈ పంట అనుకూలించినా గతం కన్నా తక్కువగానే దిగుబడి వచ్చింది.