మెట్రో రికార్డు.. కేటీఆర్‌ హర్షం...

SMTV Desk 2017-11-30 10:54:17  hyderabad metro first day record, IT minister KTR, L N T officers.

హైదరాబాద్, నవంబర్ 30 : అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన మెట్రో రైలు తొలిరోజే రికార్డులు సృష్టించింది. అధికారుల అంచనాల్ని తలకిందులు చేస్తూ.. ఏకంగా 2లక్షలకు పైగా ప్రజలు మెట్రోలో ప్రయాణించారు. ఇంతటి రికార్డు సృష్టించడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వివిధ నగరాల్లో ప్రారంభమైన మెట్రోలో తొలిరోజు 50వేలకు మించి ప్రజలు ప్రయాణించలేదు. అలాంటిది ఈ హైదరాబాద్ మెట్రోలో 2లక్షల మంది ప్రజలు ప్రయాణించి అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇంతటి ఘనతను సాధించినందుకు గాను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్య౦ లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మెట్రో స్టేషన్లలో రద్దీని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులు, ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులకు తెలిపారు.