వరంగల్ జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి..

SMTV Desk 2017-11-29 18:49:01  warangal mattevada acid attack, warangal arban news, MGM hospital, police interrogation.

వరంగల్, నవంబర్ 29 : దేశంలో ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై లైంగిక, మానసిక, శారీరక దాడులు వంటివి జరుగుతూనే ఉన్నాయి. చట్టాలెన్ని అమలులో ఉన్నా జరిగే దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఆ యువతి అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా గుర్తించిన స్థానికులు ఆమెను స్థానిక ఎంజీఎం ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను మట్టేవాడకు చెందిన యువతిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దాడికి ప్రేమ వ్యవహారం కారణమా.? లేక మరింకేమైనా కారణాలున్నాయా.? అనే దిశగా విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.