నా వల్లే హైదరాబాద్ కు మెట్రో : చంద్రబాబు

SMTV Desk 2017-11-29 17:28:15  ap cm chandrababu, comments on hyderaabad metro train.

హైదరాబాద్, నవంబర్ 29 : హైదరాబాద్ మెట్రో రైలు గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వల్లే హైదరాబాద్ కు మెట్రో రైలు వచ్చిందని అన్నారు. కేవలం బెంగళూరు, అహ్మదాబాద్ లకు మాత్రమే పరిమితమై ఉన్న మెట్రోను, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తాను పోరాడి హైదరాబాదును కూడా ఆ జాబితాలో చేర్పించానని చెప్పారు. భాగ్యనగర అభివృద్దిలో తమ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదని స్పష్టం చేశారు.