లభ్యమైన అలనాటి చిత్రాలు

SMTV Desk 2017-06-14 14:08:43  Antarctica continent,South Pole,British scientist Edward vilson

లండన్, జూన్ 14‌: అంటార్కిటికా మంచు ఖండంలో 118 ఏళ్లనాటి చిత్రాన్ని న్యూజిలాండ్‌ అంటార్కిటికా వారసత్వ ట్రస్టు పరిశోధకులు కనుగొన్నారు. ఈ చిత్రం 1912లో దక్షిణ ధృవానికి వెళ్లిన బ్రిటీష్‌ అన్వేషకుల బృంద సభ్యుడు ఎడ్వర్డ్‌ విల్సన్‌ గీసినదని గుర్తించారు. అంటార్కిటికా నుంచి తిరుగు ప్రయాణంలో విల్సన్‌ బృందంలోని ఐదుగురు మృత్యువాత పడ్డారు. 899లో నార్వేకు చెందిన అన్వేషకులు అంటార్కిటికాలో నిర్మించిన రెండు గుడిసెలను.. విల్సన్‌ బృందం తమ అన్వేషణ సమయంలో వాడుకుంది. ఆ గుడిసెల్లోనే తాజా చిత్రం దొరికింది. దీనితో పాటు మరో 1500 కళాఖండాలు గుడిసెల్లోని పెంగ్విన్‌ల వ్యర్థాల నడుమ లభ్యమైనట్లు పరిశోధకులు వెల్లడించారు. గతేడాదే వీటిని గుర్తించినప్పటికీ.. వాటిని శుభ్రపరిచే ప్రక్రియ చేపట్టిన తర్వాతే ఈ విషయాన్ని బయటికి ప్రకటించారు.