6గురు పోలీసులు..30 లాఠీ దెబ్బలు...: బాల్క సుమన్

SMTV Desk 2017-11-29 16:13:06  MP Balka suman, face book, police

హైదరాబాద్, నవంబరు 29 : ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ చేపట్టిన దీక్షను భగ్నం చేసేందుకు, పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించడంపై విద్యార్థులు భ‌గ్గుమ‌న్నారు. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్ తార్నాక‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీలో విద్యార్థులు కేసీఆర్‌కి మద్దతుగా ర్యాలీ చేప‌ట్టారు. ఈ ర్యాలీలో అప్పటి విద్యార్ధి నాయకుడైన ఎంపీ బాల్క సుమ‌న్ ను రోడ్డుపై పడేసి ఆరుగురు పోలీసులు దాదాపు 30 లాఠీ దెబ్బ‌లు విచక్షణ రహితంగా కొట్టారు. ఈ దృశ్యాలు అన్ని ఛానెళ్ల‌లో వ‌చ్చాయి. అప్పుడు పోలీసులు త‌న‌ను తీవ్రంగా కొట్టార‌ని, ఆ రోజుని మ‌ర్చిపోలేన‌ని బాల్క‌సుమ‌న్ చెబుతూ ఆ వీడియోను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.