తమిళనాడులో తయారీ...యూరప్ ట్రాక్ లపై రయ్..రయ్..

SMTV Desk 2017-11-29 15:17:08  Formula One, racing cars, Michael Schumacher, tamilnadu, nammakovai

హైదరాబాద్, నవంబర్ 29 : ఫార్ములా వన్‌ రేసు లో రయ్..రయ్..మంటూ దూసుకుపోయే కార్లను చూశారా...? ప్రస్తుతం రేసర్లుగా ఉన్నమైక్‌ షూమాకర్‌, ఫ్రెడ్డీ హంట్‌, మథియాస్‌ లాడా వాడే కార్లు ఎక్కడ తయారుచేశారో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. తమిళనాడు కోయంబత్తూరులోని, నమ్మ కోవై లో రూపొందించినవి. భారత్‌లో ఫార్ములా రేసు కార్లు తయారుచేసే రెండు సంస్థలు కోయంబత్తూరులోనే ఉన్నాయి. ఏటా దుబాయ్‌, బహ్రెయిన్‌, చెన్నై ట్రాకుల్లో ఎమ్మార్‌ఎఫ్‌ ఛాంలెంజ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే 22 మంది డ్రైవర్లు కోవైలో రూపొందించిన ఫార్ములా 2000 కార్లనే నడుపుతారు. జేఎం ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్‌ కంపెనీకి చెందిన జేఏ మోటార్‌స్పోర్ట్‌ విభాగం ఈ కార్లను తయారు చేస్తుంది. మన దేశంలో తయారై యూరప్ ట్రాక్ లపై దూసుకుపోతున్న కార్లు మనవే కావడం విశేషం. ఇక ఇదే నగరంలోని ఎల్‌జీ బాలకృష్ణన్‌ అండ్‌ బ్రదర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకే రేసు కార్లు తయారు చేస్తోంది.