మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై కట్టుబడే ఉన్నాం : కేటీఆర్

SMTV Desk 2017-11-29 12:55:35  HICC GES Meeting, IT Minister KTR speech, women reservations.

హైదరాబాద్‌, నవంబర్ 29 : హెచ్‌ఐసీసీలో జరుగుతున్న రెండవ రోజు ప్రపంచ పారిశ్రామిక సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ.. మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వడం విషయంపై సరైన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. తమ పార్టీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య కూడా తక్కువగా ఉందన్న కేటీఆర్.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో బిల్లు పెడితే తానూ మద్దతుగా నిలుస్తానని తెలిపారు.