ఏపీ అసెంబ్లీ లో తెలుగు భాష రక్షణకై చర్చలు

SMTV Desk 2017-11-29 12:43:33  AP CM Chandrababu naidu, assembly, telugu language

అమరావతి, నవంబర్ 29 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషను రక్షించుకోవాలని సభలో స్పష్టం చేశారు. తెలుగు భాషపై తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ శాసనసభలో ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉందన్నారు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా ప్రత్యేకమైన స్థానం వచ్చేలా ప్రయత్నం చేస్తానన్నారు. న్యాయ పాలనలో తెలుగు అమలు స్వతర చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు తెలుగుభాషకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.