సివిల్స్ పరీక్షకు సర్వం సిద్ధం

SMTV Desk 2017-06-14 13:08:19   Civil Services, Primary (Preliminary) Entrance Test, 18th of this month

న్యూ ఢిల్లీ, జూన్ 14 : సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక (ప్రిలిమినరీ) ప్రవేశ పరీక్షకు అంత సిద్ధం అవ్వడంతో హాజరు కానున్న అభ్యర్థులంతా తమ ప్రవేశపత్రాలను (ఈ-అడ్మిట్‌ కార్డులు) ముందుగానే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని యూపీఎస్‌సీ వెల్లడించింది. ఈనెల 18న నిర్వహించే పరీక్షకు దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానున్నారని, గతంలో వెబ్‌సైట్‌ మొరాయించడం, నెమ్మదించడం వంటి ఫిర్యాదులందిన నేపథ్యంలో ముందుగానే వాటిని పొందాలని సూచించింది. కాగా ప్రవేశపత్రాలను జాగ్రత్తగా సరిచూసుకోవటంతో పాటు, ఏమైనా తప్పులుంటే వెంటనే యూపీఎస్‌సీకి తెలపాలని సూచించారు. వాటితో పాటు అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు, విధి నిషేధాలను కూడా వెబ్‌సైట్‌ www.upsconline.nic.inలో పొందుపరిచినట్లు తెలిపారు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలైన సరే (చరవాణి, ల్యాప్‌టాప్‌, బ్లూటూత్‌, కాలిక్యులేటర్‌ వంటివి) పరీక్ష గదిలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. గత ఏడాది 4.59 లక్షల మంది ప్రాథమిక పరీక్ష రాయగా వీరిలో 1,099 మంది విజయం సాధించారు.