మరో ఉద్రిక్తతకు తెర లేపిన ఉత్తరకొరియా

SMTV Desk 2017-11-29 11:50:04  ICBM missile test, North Korean President Kim Jong, america, donald trump.

ఉత్తరకొరియా, నవంబర్ 29 : ఉత్తర కొరియా మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. ఎవరు ఊహించని విధంగా తెల్లవారుజామున అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణి "ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ఐసీబీఎం)" ని ప్రయోగించింది. ఈ క్షిపణి జపాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్ సమీపంలో పడినట్టు సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. తాము అప్రమత్తంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలతో యావత్ ప్రపంచానికి ముప్పు వాటిల్లనుందని అమెరికా రక్షణ కార్యదర్శి మాటిస్ పేర్కొన్నారు. చిత్రమేమిటంటే అమెరికా-ఉత్తర కొరియాల మధ్య యుద్ధం తప్పదన్న వార్తలు వస్తున్న తరుణంలో కిమ్ జాంగ్ ఉన్ వెనక్కి తగ్గారు. ఇప్పుడు తాజాగా ఈ క్షిపణి ప్రయోగాలతో మరోసారి ఉద్రిక్తతకు తెర లేపారు.