ట్రంప్ తో తొలి భేటీ 26న

SMTV Desk 2017-06-14 12:33:39   Friendship between India and the US, Prime Minister Modi, tour of 25th, White House Press Secretary Scene Spicer

న్యూ ఢిల్లీ, జూన్ 14 : భారత్‌-అమెరికాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ నెల 25న ప్రధాన మంత్రి మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య జరిగే తొలి సమావేశం కావడంతో ఇరు దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు నేతలు ఈ నెల 26న సమావేశమవుతారని, రెండు దేశాల పరస్పరసహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవటం, ఆర్థికపురోగతికి తోడ్పాటు, హిందూమహాసముద్రం ప్రాంతంలో భద్రత, ఉగ్రవాదంపై పోరు వంటి ప్రాధాన్యాంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అధ్యక్షునిగా విజయం సాధించిన ట్రంప్‌ను మోదీ అభినందిస్తూ ఫోన్ చేయగా... తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. తర్వాత ఇద్దరు పలు అంశాలపై ఫోనులో చర్చించు కోవడం జరిగింది.