సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్‌

SMTV Desk 2017-11-29 11:27:59  American President Donald Trump, wife Melania Trump, media

వాషింగ్టన్, నవంబర్ 29 ‌: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా తన భర్త గెలుస్తారని కూడా ఆమె అనుకోలేదంటూ స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్‌, ట్విటర్‌ వేదికగా సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలానియా దేశానికి గొప్ప ప్రథమ మహిళ. ఆమెది కష్టపడి పనిచేసే మనస్తత్వం. ఆమె తన బాధ్యతలను ఎంతో ఇష్టపడుతున్నారు. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని, మెలానియా నాకు చెప్పారు. ఇతరులకు కూడా ట్రంపే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పేవారంటూ ట్వీట్‌ చేశారు. అంతేగాక, శ్వేతసౌధంలో జరిగే కార్యక్రమాల్లోనూ మెలానియా చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. అమెరికా ప్రథమ మహిళగా ఉండేందుకు మెలానియా ట్రంప్‌ సిద్ధపడలేదని వస్తున్న వార్తలపై ట్రంప్‌ ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు.