అవినీతి అక్రమార్జన రూ.14కోట్ల

SMTV Desk 2017-06-14 12:01:40  Dealing with false registrations, , Suspended Kukatpalli Sabrijitar Rachakonda Srinivasa Rao Corruption, Approximately Rs. 14 crore swag

హైదరాబాద్, జూన్ 14 : రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మియాపూర్ భూకుంభకోణం పై తప్పుడు రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక సూత్రధారైనా సస్పెండైన కూకట్ పల్లి సబ్‌రిజిస్ట్రార్‌ రాచకొండ శ్రీనివాసరావు ప్రధాన నిందితుడుగా అవినీతికి పాల్పడటంతో అతడి నివాసంతో పాటు మరో తొమ్మిది మంది ఇళ్ల పై అవినీతి నిరోధక శాఖ మంగళవారం ఏకకాలంలో నిర్వహించిన దాడులతో అక్రమంగా ఎక్కువ మంది బినామీల పేరిట పెట్టుబడులు పెట్టిన భాగోతం బయటపడింది. దీంతో ప్రభుత్వ భూముల తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా.. అడ్డదారిలో సంపాదించి అక్రమార్జనతో ఏకంగా నాలుగు కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తండ్రి బాట లోనే కుమారుడు కనిష్క, మరో మూడు సంస్థ(హాసిని పవర్‌ ప్రాజెక్ట్స్‌, జయశ్రీ ఎంటర్‌ప్రైసెస్‌, పద్మనాభ మార్కెటింగ్‌ ప్రై.లిమిటెడ్‌)ల పేరిట 12 బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసినట్లు, పరిశీలనలో సుమారు రూ. 14కోట్ల అక్రమార్జనను గుర్తించారు. అల్వాల్‌లోని సత్యసాయి ఎన్‌క్లేవ్‌లోని శ్రీనివాసరావు ఇంట్లో అనిశా డీఎస్పీ సునీతరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోదాలు జరిగాయి. ఈక్రమంలో అక్రమార్జనతో శ్రీనివాసరావు స్థాపించిన సంస్థల్లో భార్య, కుమారుడు, వియ్యకుండి పేర్లతో నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన పాత్రలతో పాటు 15 క్రెడిక్‌కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కేపీహెచ్‌బీ ఐదవ ఫేజ్‌లో ఉండే శ్రీనివాసరావు సోదరుడు, ప్రభుత్వ వైద్యుడు నాగేందర్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. మొత్తం 693 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ట్రినిటీ ఇన్‌ఫ్రా, సువిశాల్‌ పవర్‌జెన్‌ సంస్థల నిర్వాహకులు పార్థసారథి, పీవీఎస్‌ శర్మ.. తదితరులకు తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్‌ చేసినందుకు శ్రీనివాసరావు ప్రస్తుతం చర్లపల్లి జైళ్లొ ఉన్నారు.