విమాన ప్రయాణికులకు త్వరలో తీపి కబురు...!

SMTV Desk 2017-11-28 14:30:22  AEROPLANE CANCEL CHARGES, JAYANTH SINHA, ADDITIONAL CIVIL AVATION MINISTER, NEW DELHI

న్యూఢిల్లీ, నవంబర్ 28: విమాన ప్రయాణికులు త్వరలో తీపి కబురు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొన్ని విపత్కర పరిస్థితిలో టికెట్ రద్దు చేసుకొనే వారికీ ఛార్జ్ ల భారం, తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిదని విశ్వసనీయమైన సమాచారం. ఈ విషయం పై పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్‌సిన్హా మీడియాతో మాట్లాడుతూ " సాధారణంగా టికెట్ రద్దు రూ. 3000 అంటే చాలా ఎక్కువ అని మేం భావిస్తున్నాం. చాలా సందర్భాల్లో టికెట్‌ ధర కంటే రద్దు ఛార్జీ ఎక్కువగా ఉంటుంది. మా ఉడాన్‌ పథకం కిందే గంట ప్రయాణానికి విమాన టికెట్‌ ధర రూ. 2500గా ఉంది. ఈ ఛార్జీలను తగ్గించి టికెట్‌ ధరలకు బ్యాలెన్స్‌ చేస్తే బాగుంటుంది" అని వ్యాఖ్యానించారు. త్వరలోనే దీనిపై విమానయాన సంస్థలతో చర్చించే అవకాశముందని ఆధికారులు తెలిపారు.