ఇవాంక పేరుతో చార్మినార్ వద్ద జోరుగా సాగుతున్న వ్యాపారం

SMTV Desk 2017-11-28 12:37:39  Ewanka, hyderabad, charminar

హైదరాబాద్, నవంబర్ 28 : అమెరికా అధ్యక్షుకు డోనాల్డ్ ట్రంప్ కుమారై ఇవాంక నేడు హైదరాబాద్ లో జరిగే జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఆమె విచ్చేశారు. దీంతో ఆమె రాకకై ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న చార్మినార్ వ్యాపారాలు, వారి వ‌ద్ద వచ్చి షాపింగ్ చేయ‌నుంద‌ని వార్తలు వచ్చాయి. దీంతో వ్యాపారస్తులు తమ సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెట్టి ప్ర‌త్యేక డిజైన్ల‌తో గాజులు త‌యారు చేశారు. ప్ర‌స్తుతం చార్మినార్ దగ్గ‌రి లాడ్‌బ‌జార్‌లో ఇవాంకా పేరుతో ఉన్న‌ గాజులు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. అంతేకాకుండా భార‌త‌, అమెరికా జాతీయ జెండాల‌తో గాజులపై డిజైన్లు వేసి అమ్ముతున్నారు. ఇవాంక ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తారో, లేదో ఇంకా ఎలాంటి సమాచారం లేకపోయినా ఆమె పేరుతో అక్కడ వ్యాపారం మాత్రం బాగానే జరుగుతుంది.