చంద్రబాబు ఆశను.. నీరాశ చేసిన అమెరికా అధికారులు...

SMTV Desk 2017-11-28 12:07:02  ap cm chandrababu, ivanka trump hyderabad visit.

అమరావతి, నవంబర్ 28: హైదరాబాద్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ లో ఇవాంక ట్రంప్ పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్న ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు ప్రయత్నానికి అమెరికా అధికారులు గండి కొట్టారు. ఇవాంకను అమరావతికి ఆహ్వానించి తమ రాష్ట్ర ఇమేజ్ ను పెంచుదామనుకున్నారు చంద్రబాబు. కానీ భద్రత దృష్ట్యా, పర్యటన షెడ్యూల్ లో లేని కారణంగా అమెరికా అధికారులు చంద్రబాబు ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు తెలిసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నచంద్రబాబు, ఇవాంకా ఏపీ పర్యటనకు ఒప్పుకుంటే అమ‌రావ‌తిలోగానీ, విశాఖ‌లో గానీ భారీ వేడుక నిర్వహించాలని ఆలోచించారట. కానీ అమెరికా కాన్సులేట్‌ అధికారులు.... ఆమె గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో మాత్రమే పాల్గొంటుంద‌ని, వేరే వేడుకల్లో పాల్గొనబోదని చెప్పడంతో బాబు ఆశ నిరశైంది.