త్వరలో ప్రారంభం కానున్న ఎల్ అండ్ టీ భారీ మాల్స్

SMTV Desk 2017-11-28 10:56:06  l and t , big shooping mals, hyderabad, cinema theaters

హైదరాబాద్, నవంబర్ 27 : భాగ్యనగర వాసుల కలల ప్రాజెక్ట్ మెట్రో ఈ రోజు ప్రారంభం కానుంది. అయితే దీనిని నిర్మించిన దిగ్గజ ఎల్ అండ్ టీ సంస్థ భారీ మాల్స్ నిర్మాణం చేపట్టింది. కేవలం మెట్రో రైలుతో వచ్చే ఆదాయంతో రైలు మార్గం నిర్మాణం కోసం తాము వెచ్చించిన నిధులు వెనక్కు రావంటూ, ముందు చేసుకున్న ఒప్పంద విధానాల ప్రకారం, పెద్ద మాల్స్ నిర్మాణం చేపడుతుంది. ఇప్పటికే పంజాగుట్ట, ఎర్రమంజిల్ మధ్య కేవలం కిలోమీటరు దూరంలో రెండు మాల్స్ ను సంస్థ పూర్తి చేసింది. ఈ రెండు చోట్ల 12 వరకూ సినిమా హాల్స్ ఉంటాయి. రూ.2243 కోట్ల వ్యయంతో నిర్మాణం అవుతున్న మొత్తం నాలుగు మాల్స్ కలిపి 60 లక్షల చదరపు అడుగుల్లో ఉండగా, ఒక్క రాయదుర్గం వద్ద ఉండే హైటెక్ సిటీ మాల్ 15 ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమవడం విశేషం. మెట్రో రైలు ప్రారంభోత్సవం తరువాత మాత్రమే ఈ మాల్స్ ప్రారంభించుకోవచ్చన్న నిబంధన ఉండగా, నేడు ఆ ముహూర్తం ఖరారైంది. ఈ రోజు నుంచి మెట్రో సేవలు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానుండగా, సాధ్యమైనంత త్వరలోనే మాల్స్ ను ప్రారంభించే యోచనలో ఎల్ అండ్ టీ ఉంది.