ఖాదీ దుస్తులు వేసుకోనున్న పోలీసులు

SMTV Desk 2017-06-13 19:43:56  police, khadi, maharashtra, dress, khadi dress, maharashtra police uniform,

పోలీసులంటే గుర్తుకు వచ్చేది ఖాకీ యూనిఫాం, మహారాష్ట్రలో ఇప్పుడు ఖాకీ యూనిఫాంకు వారంలో ఒకరోజు సెలవు ఇచ్చి, ఖాదీకి భాధ్యత పంచారు. మహారాష్ట్ర పోలీసు శాఖ ఖాదీ యూనిఫామ్ ధరించాలని తమ సిబ్బందికీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎప్పుడూ ఖాకీ దుస్తుల్లో కనిపించే పోలీసులు వారంలో ఒక రోజు ఖాదీ యూనిఫామ్ ధరించి విధులకు హాజరుకావాలని ప్రత్యేక ఐజీ అనూప్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చునని, ఖాదీని ప్రోత్సహించడం అన్ని శాఖల భాధ్యతని అన్నారు. పోలీసు శాఖలో ఉన్న సిబ్బంది, అధికారులు ఖాదీ యూనిఫామ్‌ని తమతో పాటు ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఇందుకు సంబంధించిన సర్క్యూలర్‌ను జూన్‌ 1న విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలు అమలయ్యేలా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన కోరారు.