ఆంగ్ల డిఎడ్ కు భారీ స్పందన

SMTV Desk 2017-05-28 18:02:29  ded,english medium,dietcet,notification

హైదరాబాద్, మే 26 : తెలంగాణా రాష్ట్రంలో తొలిసారిగా ఆంగ్లమాధ్యమంలో ప్రవేశపెడుతున్న డిఎడ్ కోర్సుకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. డిఇఇసెట్ లో ఆంగ్లమాధ్యమం కోర్సునకు 12వేలకు పైగా దరఖాస్తులు రావడంతో అధికారులే ఆశ్చర్యానికి గురైయ్యారు. ఆంగ్లమాద్యమం కోర్సుకు స్వల్ప సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయన్న అధికారుల అంచనాలు తలక్రిందులైయ్యాయి. రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో 4,800 కు పైగా సర్కారు పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి ఆంగ్ల మాద్యమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆంగ్ల మాద్యమంలో బోధన సాగకుంటే సర్కారు బడుల మనుగడ కష్టమని భావిస్తున్న విద్యాశాఖ, మున్ముందు ఆంగ్లమాధ్యమంలో ఉపాధ్యాయ విద్య పూర్తిచేసిన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలని భావిస్తోంది. ఆ కారణంగా ఆంగ్ల డిఎడ్ పై ఆసక్తి పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలలో ఆంగ్ల కోర్సులను ప్రారంభిస్తున్నారు.