ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన గోపీచంద్..

SMTV Desk 2017-11-27 14:39:11  gopichand, clarity about prabhas marriage, Oxygen movie.

హైదరాబాద్, నవంబర్ 27 : ప్రముఖ కథానాయకుడు గోపీచంద్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఇంతకాలం "బాహుబలి" సినిమాలతో బిజీగా ఉన్నందునే పెళ్లి గురించి ఆలోచించలేదన్నారు. కాస్త ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి త్వరలోనే పెళ్లి ముచ్చట్లు వెల్లడిస్తాడని తెలిపారు. గోపీచంద్ ప్రస్తుతం "ఆక్సిజన్" చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తనలో ఆక్సిజన్ నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన అను ఇమ్మాన్యుయేల్, రాశి ఖన్నా నటిస్తున్నారు.