ఆ విషయం నన్ను బాగా బాధించింది : గీతామాధురి

SMTV Desk 2017-11-27 12:09:49  geetha maduri, tolly wood singer, i dreams, interview

హైదరాబాద్, నవంబర్ 27 : తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనిగా గీతామాధురి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్నిసంపాదించుకున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడిన గీతామాధురి, తనని బాగా బాధపెట్టిన సంఘటనలలో ఒక దానిని గురించి ప్రస్తావించింది. "ఒక టీవీ ప్రోగ్రామ్ కి నేను, నందూ గెస్టులుగా వెళ్లవలసి వుంది. మేం వస్తే ఆ కార్యక్రమం చేయమని కొంతమంది సింగర్స్ చెప్పారట. ఆ విషయం తరువాత మాకు తెలిసింది. వాళ్ల పేరు చెప్పాలని లేదు. అవతల వాళ్లు ఎందుకలా ఫీలయ్యారు..? ఎందుకలా చేశారు.? నా అవకాశాన్ని ఎందుకు పోగొట్టారు..? అని ఆ రోజంతా నేను చాలా బాధపడ్డాను. ఆ సింగర్స్ ఆ తరువాత నాకు చాలాసార్లు కలిశారు. మొదట్లో ఎందుకలా చేశారని అనుకునేదాన్ని కానీ, నాతో బాగానే వుంటున్నారని ఆ విషయాన్ని గురించి ఆలోచించడం మానేశాను" అని తెలిపారు.