రాజకీయాలు ముఖ్యం కాదు : చంద్రబాబు

SMTV Desk 2017-11-27 12:06:37  chandrababu naidu, speech, Giddi Ishwari was invited to TDP Party,

అమరావతి, నవంబర్ 27 : గిడ్డి ఈశ్వరిని టీడీపీ పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తన అభివృద్ధి కార్యక్రమాలను చూసి, మరింత మంది విపక్ష నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత, రాజకీయాలు ముఖ్యం కాదని, అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చిన తనకు, మంచి స్పందన వచ్చిందని, ఇది ఒక శుభ పరిణామమని వెల్లడించారు. గిరిపుత్రుల అభివృద్ధికి తాను అనునిత్యమూ శ్రమిస్తున్నానని, అడవులను నమ్ముకుని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారి ఆరోగ్యానికి ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు అన్ని ఇళ్ళకు కలిపి 75 యూనిట్ల కరెంట్ ను ఉచితంగా ఇచ్చామని, సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.