సిరియాపై రష్యా వైమానిక దాడి...

SMTV Desk 2017-11-27 11:14:07  siriya, russia, isis, terrorist, death

సిరియా, నవంబర్ 27 : సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది. సిరియాలోని డీర్‌ ఎజార్‌ ప్రావిన్స్‌లో ఆదివారం రష్యా సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 34 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐసిస్‌ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు ఈ దాడులు చేపట్టాయి. ఐసిస్‌ ఉగ్రవాదుల చేతిలో ఉన్న చివరి ప్రదేశం డీర్‌ ఎజార్‌. 2015 నుంచి సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌తో రష్యా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తోంది. ఐసిస్‌ ఉగ్రవాదులపై సిరియా చేస్తున్న పోరుకు రష్యా మద్దతుగా నిలుస్తుంది. డీర్‌ ఎజార్‌ రాష్ట్రంలోని తొమ్మిది శాతం ప్రాంతం ఐసిస్‌ ఆధీనంలో ఉంది. సిరియాలో 2011 నుంచి జరుగుతున్న అంతర్యుద్ధంలో లక్షల సంఖ్యలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది ప్రజలు శరణార్థులుగా మారారు.