ఎయిర్ షో లో కుప్పకూలిన విమానం

SMTV Desk 2017-06-13 16:09:57  Lonyoon vilet Air show, North France,second world war Aeroplane

ఫ్రాన్స్‌, జూన్ 13 : లాంగుయాన్‌ విలెట్‌ ఎయిర్‌ షో ఉత్తర ఫ్రాన్స్‌లో కొనసాగుతోంది. వైమానిక విన్యాసాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో సందర్శకులు ఎయిర్‌షోకి తరలివచ్చారు. పైలట్ల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా హడావుడిగా మారింది. ఇంతలో ఓ విమానం సందర్శకులకు దగ్గరగా వచ్చి ఒక్కసారిగా కుప్పకూలింది. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఓ యుద్ధ విమానం ఈ షోలో పాల్గొంది. ఈ విమానం చేసే విన్యాసాలను చూసేందుకు సందర్శకులు అక్కడికి చేరుకున్నారు. ఏమైందో తెలియదుగానీ.. ఆ యుద్ధ విమానం కిందికి దిగుతున్న సమయంలో విమానం ముందు రెక్కలు నేలను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా అది అదుపుతప్పి పక్కకు పల్టీ కొట్టింది. సందర్శకులకు కొద్ది మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురికావడం జరిగింది. ఘటనలో విమాన పైలట్‌ గాయపడటంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.