ఇవాంక పర్యటన షెడ్యూల్

SMTV Desk 2017-11-25 12:44:30  ivanka, golkonda launch, hyderabad

హైదరాబాద్, నవంబర్ 25 : హైదరాబాద్ నగరానికి ఈ నెల 28వ తేదిన జీఈఎస్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారై ఇవాంక విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాంక రాకతో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి, రోడ్లపై బ్యానర్లను నిషేధించారు. అలాగే భద్రతా ఏర్పాట్లలో 6 వేల మంది పోలీసులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ఆమెకు అమెరికా సీక్రెట్ సర్వీస్ కమెండోలు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరవుతున్న ప్రధాని మోదీ, ఇవాంకలతో పాటు ప్రముఖులకు ఫలక్ నుమా, గోల్కొండ కోటల్లో విందు కార్యక్రమం నిర్వహించనున్నారు. కానీ, గోల్కొండలో జరిగే విందుకు ఇవాంకా హాజరుకావడం లేదు. 29వ తేదీన సదస్సు అనంతరం ఆమె నేరుగా విమానాశ్రయానికి వెళ్లి రాత్రి 9.20 గంటలకు అమెరికాకు పయనం అవుతున్నట్లు సమాచారం.